మానసికోల్లాసానికి క్రీడలు దోహదం

ABN , First Publish Date - 2021-01-13T05:24:01+05:30 IST

మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని సంతలక్ష్మిపురం మాజీ సర్పంచ్‌ సూరపు నారాయణదాస్‌ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం గ్రామయువసేన ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు.

మానసికోల్లాసానికి క్రీడలు దోహదం
వంగర: విజేతలకు బహుమతి అందిస్తున్న దృశ్యం

సంతలక్ష్మిపురం(పోలాకి) జనవరి 12: మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని  సంతలక్ష్మిపురం  మాజీ సర్పంచ్‌ సూరపు నారాయణదాస్‌ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం గ్రామయువసేన ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ప్రతీఏటా గ్రామంలో ప్రముఖ వాలీబాల్‌ క్రీడాకారుడు  సూరపు శివకుమార్‌ జ్జాపకార్థం ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం ఉట్టి కొట్టడం, మహిళలకు  ముగ్గులు, యువకులకు కర్రసాము,  సంగిడీలు, చిన్నారుల ఈవెం ట్స్‌  పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు.  కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.

 

వాలీబాల్‌ విజేత నూకలివాడ

వంగర: వంగరలో జనహితా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిని జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీల్లో నూకలివాడ (బలిజిపేట మండలం) విజేతగా నిలిచింది. నాలుగు రోజులుగా సాగిన పోటీల్లో 57 జట్లు పాల్గొన్నాయి. విజేత జట్టు కు జ్ఞాపిక, నగదు పురస్కారం అందజేశారు.  రెండో స్థానాన్ని ఉణుకూరు, మూడో స్థానాన్ని బలిజిపేట, నాలు గో స్థానాన్ని అరసాడ కైవసం చేసుకున్నాయి. అలాగే రామా యూవ సేనా ఆ ధ్వర్యంలో నిర్వహించిన  జిల్లా స్థాయి క్రికెట్‌  పోటీల్లో పాలకొండ బహుమతి సాధించిందని, బుధవారం బహుమతి ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. 

 


 

Updated Date - 2021-01-13T05:24:01+05:30 IST