మళ్లీ సర్వర్‌ డౌన్‌!

ABN , First Publish Date - 2021-07-13T05:08:13+05:30 IST

రిజిస్ట్రేషన్‌ శాఖలో సాంకేతిక సమస్యలు కొలిక్కి రాలేదు. దీంతో సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

మళ్లీ సర్వర్‌ డౌన్‌!
సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో సర్వర్‌ సమస్యతో ఖాళీగా ఉన్న ఉద్యోగులు




జిల్లాలో నిలిచిన రిజిస్ట్రేషన్లు

బోసిపోయిన కార్యాలయాలు

(ఇచ్ఛాపురం)

రిజిస్ట్రేషన్‌ శాఖలో సాంకేతిక సమస్యలు కొలిక్కి రాలేదు. దీంతో సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్‌ డౌన్‌ కావడంతో గత కొద్దిరోజులుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అసౌకర్యం ఎదురైన సంగతి తెలిసిందే. సోమవారం సమస్య పరిష్కారమవు తుందని సిబ్బంది చెప్పడంతో క్రయవిక్రయదారులు కార్యాలయాల వద్దకు చేరుకున్నారు. కానీ సమస్య పరి ష్కారం కాకపోవడంతో నిరాశతో ఇంటిముఖం పట్టారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్లలో ఉన్న డేటా బేస్‌ను హైదరాబాద్‌ నుంచి మంగళగిరి సెంటర్‌లోకి మార్చే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. శుక్రవారం నుంచే ప్రక్రియ ప్రారంభమైందని ఆ శాఖ అధికారులు చెబుతు న్నారు. జిల్లాలో 15 కార్యాలయాలకుగాను రోజుకు సగటున 200 నుంచి 250 వరకూ రిజిస్ట్రేషన్లు జరిగేవి. సాంకేతిక సమస్య కారణంగా గత కొద్దిరోజులుగా పదుల సంఖ్యలో కూడా రిజిస్ర్టేషన్లు అయిన దాఖలాలు లేవు. రిజిస్ట్రేషన్లు లేక కార్యాలయాలు బోసిపోయాయి. ప్రస్తు తం ఆ శాఖ ఉన్నతాధికారులు సర్వర్‌ సామర్థ్యం పెంచే పనిలో ఉన్నారు. ఆ పనులు పూర్తయితే రిజిస్ట్రేషన్ల శాఖలో సాంకేతిక సమస్యలు తగ్గుముఖం పట్టను న్నాయి. ఈ విషయమై జిల్లా రిజిస్ర్టార్‌ సత్యనారాయణ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, సర్వర్‌ సామర్థ్యం పెంచే పనులు జరుగుతున్నందునే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిందన్నారు. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు వేగ వంతం కానున్నాయని తెలిపారు.






Updated Date - 2021-07-13T05:08:13+05:30 IST