‘తెలుగు’కు తీవ్ర నష్టం

ABN , First Publish Date - 2021-11-01T05:10:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో తెలుగు మీడియం లేకుండా పోతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌షాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్‌ జిల్లా కార్య దర్శి కె.రమేష్‌ ఆధ్వర్యంలో ‘విద్యారంగ పరిణామాలు-సమకాలీన అంశా లు’పై సదస్సు నిర్వహించారు.

‘తెలుగు’కు తీవ్ర నష్టం
హరిపురం: వీరగున్నమ్మ స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ 

కాశీబుగ్గ : రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో తెలుగు మీడియం లేకుండా పోతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌షాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె.రమేష్‌ ఆధ్వర్యంలో ‘విద్యారంగ పరిణామాలు-సమకాలీన అంశా లు’పై సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధా నాలపై ఎటువంటి చర్చలు చేపట్టకుండా అమలు చేయడంతో ఇబ్బం దులు తప్పవన్నారు. దీనివల్ల 3,4,5 తరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈ విధానంతో వేల పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి విధానాలను వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర, గిరిధర్‌, కిషోర్‌కుమార్‌, చిట్టిబాబు, ఎల్‌వీ చలం, బి.ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు.


వీరగున్నమ్మకు నివాళి

హరిపురం : రైతాంగ పోరాటాలకు స్ఫూర్తి ప్రదాత సాసుమాను వీరగున్నమ్మ అని  ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ అన్నారు. వీజీపురంలోని వీరగున్నమ్మ స్మారక స్థూపాన్ని ఆదివారం సందర్శించి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, పొందూరు అప్పారావు, కిషోర్‌, గుంట కోదండరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-01T05:10:18+05:30 IST