అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలకు విజయ్ ఎంపిక
ABN , First Publish Date - 2021-11-29T05:03:09+05:30 IST
విజయ హజారే ట్రోఫీ (మెన్స్ సీనియర్ వన్డే) అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలకు ఆంధ్రా జట్టు తరఫున టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఎంపిక య్యారు. ఈ మేరకు ఆదివారం ఏసీఏ నుంచి వర్తమానం అందినట్లు శ్రీకాకుళం జిల్లా బాలురు, బాలికల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తమ్మినేని చిరంజీవి నాగ్, జేవీ భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

టెక్కలి రూరల్: విజయ హజారే ట్రోఫీ (మెన్స్ సీనియర్ వన్డే) అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలకు ఆంధ్రా జట్టు తరఫున టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఎంపిక య్యారు. ఈ మేరకు ఆదివారం ఏసీఏ నుంచి వర్తమానం అందినట్లు శ్రీకాకుళం జిల్లా బాలురు, బాలికల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తమ్మినేని చిరంజీవి నాగ్, జేవీ భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయ్ ఇటీ వల గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లో అంతర్రాష్ట్ర పోటీల్లో అండర్-25 తరఫున ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా జిల్లాకు విజయ్ను అంతర్రాష్ట్ర పోటీలకు ఎంపికచేశారు. ఈ సందర్భంగా విజయ్‌ని పలువురు అభినందించారు.