విప్రోకు 243 మంది ‘ఆదిత్య’ విద్యార్థుల ఎంపిక

ABN , First Publish Date - 2021-10-30T05:08:20+05:30 IST

ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకు 243 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల (ఐతం) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీవీ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ ద్వారా విప్రో నిర్వహించిన పలు పరీక్షలను ఎదుర్కొని తమ కళాశాల వివిధ బ్రాంచిల విద్యార్థులు ఎంపికవడం ఆనందంగా ఉందన్నారు.

విప్రోకు 243 మంది ‘ఆదిత్య’ విద్యార్థుల ఎంపిక
ఉద్యోగాలకు ఎంపికైన ఆదిత్య విద్యార్థులు

టెక్కలి, అక్టోబరు 29: ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకు 243 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల (ఐతం) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీవీ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ ద్వారా విప్రో నిర్వహించిన పలు పరీక్షలను ఎదుర్కొని తమ కళాశాల వివిధ బ్రాంచిల విద్యార్థులు ఎంపికవడం ఆనందంగా ఉందన్నారు. 363 మంది రాత పరీక్షకు అర్హత పొందగా వీరిలో 243 మంది ఎంపికయ్యారని, మరో 60 మంది ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉందన్నారు.  విప్రోకు ఎంపికైన విద్యార్థులను డైరెక్టర్‌తో పాటు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏఎస్‌ శ్రీనివాసరావు, ఫిన్సింగ్‌ స్కూల్‌ డీన్‌ డాక్టర్‌ డి.విష్ణుమూర్తి, ప్లేస్‌మెంట్‌ అధికారి సంతోష్‌కుమార్‌ అభినందించారు. 

 

 

Updated Date - 2021-10-30T05:08:20+05:30 IST