ఆర్టీసీకి దసరా ఆదాయం రూ.36 లక్షలు: ఆర్‌ఎం
ABN , First Publish Date - 2021-10-21T05:26:03+05:30 IST
దసరాకు అదనంగా బస్సులు వేయడంతో రూ.36 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ జిల్లా రీజినల్ మేనేజర్ టి.వెంకటరామం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

కర్నూలు, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): దసరాకు అదనంగా బస్సులు వేయడంతో రూ.36 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ జిల్లా రీజినల్ మేనేజర్ టి.వెంకటరామం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దసరా పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారి కోసం ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, చెన్నై నగరాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 129 ప్రత్యేక బస్సులు నడిపామని, వాటి ద్వారా మొత్తం రూ.36,93,299 ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.
రెం