ఆర్టీసీ బస్సు-లారీ ఢీ

ABN , First Publish Date - 2021-01-13T05:50:22+05:30 IST

నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై మంగళ వారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న సంఘటన చోటు చేసుకున్నా ఎవరికీ ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 55 మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఆర్టీసీ బస్సు-లారీ ఢీత్రుటిలో తప్పిన ప్రమాదం ఫ 55 మంది ప్రయాణికులు సురక్షితం

 నరసన్నపేట, జనవరి 12: నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై మంగళ వారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న సంఘటన చోటు చేసుకున్నా ఎవరికీ ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 55 మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలి పిన వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు నరసన్న పేట నుంచి హైవేపై  వెళుతుండగా యూటర్న్‌ తీసుకునే సమయంలో ఒకేసారి ఆర్టీసీ బస్సు మలు పు తిప్పగా అదే సమయంలో టెక్కలి వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న భారీ ట్రక్కు సడన్‌ బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పి బోల్తాపడింది. ట్రక్కు పైన ఉన్న భారీ ఇనుప రేకుల కట్ట ఆర్టీసీ బస్సు వెనుక భాగంలో ఢీకొంది. దీంతో బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు సల్వ గాయాలు కాగా, వెంటనే బస్సు దిగి పరుగులు పెట్టారు.  ట్రక్కు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెప్పారు. వెనుక వైపు నుంచి వచ్చే వాహనాలను పరిశీలించకుండా ఆర్టీసీ డ్రైవర్‌  వాహనాన్ని నడపినట్లు  స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్‌ స్తంభించింది. ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

 చెన్నైలో వలస మత్స్యకారుడు మృతి

కవిటి:  మండలంలోని జగతి పంచాయతీ పరిధిలోగల చిన్న కర్రివానిపాలెం గ్రామానికి చెందిన  మత్స్యకారుడు బడే భీమరాజు (56) చెన్నైలో మృతి చెందాడు. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... కొద్దేళ్ల కిందట భీమరాజు  చెన్నై వలస వెళ్లి చేపలవేట చేసి, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల ఎనిమిదో తేదీన సముద్రం మధ్యలో వేట సాగిస్తుండగా హఠాత్తుగా వాంతులు కాగా అక్కడికక్కడే మృతిచెందాడు. భీమరాజుకు  భార్య ఇద్దరు కుమార్లు, ఒక కుమార్తె ఉన్నారు. చెన్నైలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. భీమరాజు మృతితో  కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తి అరెస్టు 

పలాస: కాశీబుగ్గ అగ్నిమాపక కేంద్రం వద్ద ఈనెల 8న చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన సూదికొండ కాలనీకి చెందిన బత్తిన దేవరాజ్‌ను మంగళవారం  అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ శంకరరావు తెలిపారు. రోటరీనగర్‌కు చెందిన మహిళ మార్నింగ్‌వాక్‌కు వెళ్తున్న సమయంలో బంగారు గొలుసుతో పాటు ఆమె సెల్‌ఫోన్‌ను దేవరాజు దొంగిలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీ ఫుటేజీని పరిశీలించి దేవరాజును అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని పాతపట్నం సబ్‌జైలుకు తరలించినట్లు సీఐ చెప్పారు.


Updated Date - 2021-01-13T05:50:22+05:30 IST