వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి

ABN , First Publish Date - 2021-12-20T04:58:45+05:30 IST

గ్రామాల్లో వైసీపీ నాయకులు చేస్తున్న అస త్య ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గౌతు శిరీష కోరారు. ఆదివారం మండలంలోని తోటూరు బీచ్‌ లో పలాస మండల సమన్వయ కమిటీ సమావేశం పార్టీ మండ లాధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో జరిగింది.

వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి
మాట్లాడుతున్న గౌతు శిరీష


టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

వజ్రపుకొత్తూరు: గ్రామాల్లో వైసీపీ నాయకులు చేస్తున్న అస త్య ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గౌతు శిరీష కోరారు. ఆదివారం మండలంలోని తోటూరు బీచ్‌ లో పలాస మండల సమన్వయ కమిటీ సమావేశం  పార్టీ మండ లాధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయంఖాయమని, చంద్ర బాబు ముఖ్యమంత్రిగా గెలుపొందుతారన్నారు. నాయకత్వం పట్ల నమ్మకంతో కార్యకర్తలు పని చేయాలన్నారు. పలాస కాశీబుగ్గ ముని సిపల్‌ మాజీ చైర్మన్‌ వజ్జ బాబూరావు మాట్లాడుతూ టీడీపీ నాయ కత్వం, గౌతు కుటుంబ సభ్యులపై నమ్మకంతోనే పార్టీలో చేరానన్నారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానన్నారు. సమావేశంలో  టీడీపీ నాయకుడు విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-20T04:58:45+05:30 IST