పింఛన్ల తొలగింపు అన్యాయం

ABN , First Publish Date - 2021-09-04T05:26:41+05:30 IST

వివిధ కారణాలతో సామాజిక పింఛన్లు తొలగించడం అన్యాయమని టీడీపీ నేతలు అన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు.

పింఛన్ల తొలగింపు అన్యాయం
జలుమూరు: ఎంపీడీవో గోపాలకృష్ణకు వినతిపత్రం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి


  ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

 జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల నిరసనలు

  అధికారులకు వినతి పత్రాలు అందజేత

(ఆంధ్రజ్యోతి బృందం)

వివిధ కారణాలతో సామాజిక పింఛన్లు తొలగించడం అన్యాయమని టీడీపీ నేతలు అన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇప్ప టి సీఎం జగన్‌ పింఛన్‌ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చి, ఇప్పుడు వివిధ కారణాలతో కోత విధించడం దారుణమన్నారు. దీంతో అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, ఇతర పింఛనుదారులు రోడ్డున పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణం పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ అధి కారులకు వినతిపత్రాలను అందించారు. కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 


 

Updated Date - 2021-09-04T05:26:41+05:30 IST