జలాశయాల నుంచి సాగునీరు విడుదల
ABN , First Publish Date - 2021-07-09T05:19:17+05:30 IST
జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల నుంచి సాగునీటిని గురువారం విడుదల చేశారు. గొట్టా బ్యారేజీ ఎడమ ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వంశధార ప్రాజెక్ట్ ఎస్‌ఈ డోల తిరుమలరావు, ఎమ్మెల్యే రెడ్డి శాంతి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కాలువ ద్వారా 100 క్యూసె

హిరమండలం/పాలకొండ/వంగర: జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల నుంచి సాగునీటిని గురువారం విడుదల చేశారు. గొట్టా బ్యారేజీ ఎడమ ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వంశధార ప్రాజెక్ట్ ఎస్‌ఈ డోల తిరుమలరావు, ఎమ్మెల్యే రెడ్డి శాంతి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నట్టు ఎస్‌ఈ పేర్కొన్నారు. ముందుగా చెరువులు నింపాలని ఆయన ఆదేశించారు. ఈఈలు ప్రదీప్, సుశీల్‌కుమార్, డీఈ ప్రభాకరరావు, బ్రహ్మానందం పాల్గొన్నారు. మడ్డువలస రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని ఎమ్మెల్యే కంబాల జోగులు విడుదల చేశారు. శివారు ఆయకట్టుకు సాగునీరందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఈ సుధాకర్, డీఈ నర్మదా పట్నాయక్, రమణమూర్తి, అప్పలనాయుడు, నితిన్, సతీష్ పాల్గొన్నారు. తోటపల్లి కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నీటిని తోటపల్లి పాత బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (శ్రీకాకుళం) డి.శ్రీనివాసరావు విడుదల చేశారు. అంతకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.