రూ.47 లక్షల వ్యయంపై రికార్డులు సరిగా లేవు..

ABN , First Publish Date - 2021-11-02T05:36:37+05:30 IST

గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో 2019-20, 2020-21 సంవత్సరాల్లో చేపట్టిన పనులకు సంబంధించి రూ.47 లక్షల వ్యయంపై రికార్డులు సరిగా లేవని ఎస్సార్పీ వెంకటేశ్వర రావు ప్రకటించించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో సోమవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.

రూ.47 లక్షల వ్యయంపై రికార్డులు సరిగా లేవు..
సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్న అధికారులు


సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెల్లడి

రేగిడి, నవంబరు 1: గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో 2019-20, 2020-21 సంవత్సరాల్లో చేపట్టిన పనులకు సంబంధించి రూ.47 లక్షల వ్యయంపై రికార్డులు సరిగా లేవని ఎస్సార్పీ  వెంకటేశ్వర రావు ప్రకటించించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో సోమవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. డ్వామా పీడీ కూర్మారావు, ఎంపీపీ దార అప్పలనరసమ్మ, ఇతర శాఖల అధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ రెండేళ్లలో చేపట్టిన పను లు,  నిధుల వినియోగం, నిధుల దుర్వినియోగంపై వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఉపాధి, హౌసింగ్‌, వెటర్నరీ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలు చేపట్టిన పనుల్లో లోపాలున్నట్లు గుర్తించారు. అవకతవకల మొత్తం రికవరీపై లెక్కలు వేస్తున్నట్లు ఎఆర్పీ తెలిపారు. వెటర్నరీ శాఖకు సంబంధించి ఎటు వంటి రికార్డులు లేకుండా రూ.17,804 వ్యయంచేసినట్లు గుర్తించి రికవరీకి ఆదేశించామన్నారు. నాయిరాలవలస పంచాయతీ మస్టర్లలో చిన్న పాటి తేడాలు గుర్తించినట్లు తనిఖీ సిబ్బంది తెలిపారు. డ్వామా పీడీ కూర్మారావు మాట్లాడుతూ.. పనులకు సంబంధించిన రికార్డులు సామా జిక తనిఖీ అధికారులకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత స్థానిక యం త్రాంగంపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏపీడీ రోజారాణి, రాజాం ఏపీ డీ విద్యాసాగర్‌, ఎంపీడీవో ఎస్‌.రఘునాథ్‌ ఆచారి పాల్గొన్నారు.

 

Updated Date - 2021-11-02T05:36:37+05:30 IST