వీఎల్‌టీ ఎగనామం!

ABN , First Publish Date - 2021-10-20T05:38:03+05:30 IST

మునిసిపాలిటీల్లో ఖాళీ స్థలాలకు సంబంధించిన పన్ను బకాయి లు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. భూ యజమానులు ఏళ్ల తరబడి బకాయిల చెల్లింపులో తాత్సారం చేస్తున్నారు. కార్పొరేషన్‌, మునిసి పాలిటీ, నగర పంచాయతీల పరిధిలో ఖాళీ స్థలాలు ఉన్న ప్రతి యజ మాని ఏటా రెండు శాతం చొప్పున వేకెంట్‌

వీఎల్‌టీ ఎగనామం!


 ఖాళీ స్థలాల్లో ఇళ్లు, పంటలు ఉన్నట్లు నమోదు

 పన్ను కట్టకుండా యజమానుల జిమ్మిక్కులు 

 పట్టణాల్లో పేరుకు పోతున్న బకాయిలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

మునిసిపాలిటీల్లో ఖాళీ స్థలాలకు సంబంధించిన పన్ను బకాయి లు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. భూ యజమానులు ఏళ్ల తరబడి బకాయిల చెల్లింపులో తాత్సారం చేస్తున్నారు. కార్పొరేషన్‌, మునిసి పాలిటీ, నగర పంచాయతీల పరిధిలో ఖాళీ స్థలాలు ఉన్న ప్రతి యజ మాని ఏటా రెండు శాతం చొప్పున వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ (వీఎల్‌టీ) చెల్లించాలి. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, రాజాం మునిసిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీ ఉంది. వీటి పరిధిలో రూ.1.20 కోట్లకుపైగా వీఎల్‌టీ బకాయిలు పేరుకుపోయాయి.

- శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలో 680 ఖాళీ స్థలాలను అధికారులు గతంలో గుర్తించారు. వీటికి సంబంధించి రూ.60 లక్షల మేర పన్ను బకాయిలు ఉన్నాయి.

-రాజాంలో వందకుపైగా ఖాళీ స్థలాలు ఉండగా... కేవలం రూ.11 లక్షలు మాత్రమే వసూలయ్యాయి.

-ఆమదాలవలసలో 149 ఖాళీ స్థలాలకు గానూ ఏడాదికి రూ.11 లక్షలకుపైగా పన్నులు చెల్లించాల్సి ఉంది. కాగా, కేవలం రూ.3 లక్షలు మాత్రమే వసూలయ్యాయి.

-పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, పాలకొండ నగర పంచాయతీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొందరు భూ యజమానులు ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చిన్నషెడ్లు వేసి వాటినే నిర్మాణాలుగా చూపుతు న్నారు. ఆపై పన్ను ఎగనామం పెడుతున్నారు. మరికొందరు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి వదిలేస్తున్నారు. ఇంకొందరు పంట పొలాలు, తోటలు సాగు చేస్తున్నట్టు వ్యవసాయ భూమిగా చూపుతూ పన్నులు చెల్లించడం లేదు. వీఎల్‌టీ చెల్లించని వారికి అధికారులు నోటీసులు జారీచేసినా స్పందించడం లేదు. గతంలో ఖాళీ స్థలాలు, వ్యవసాయేతర భూములను గుర్తించి పన్నులు విధించేందుకు మునిసిపల్‌, రెవె న్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. కానీ కొన్నాళ్లుగా పన్ను వసూళ్లపై అధికారులు పెద్దగా దృష్టి సారించ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం మినహా మిగిలిన చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త పాలకవర్గాలు పన్నుల వసూళ్లపై దృష్టి సారించడంతో బకాయిలు బయటపడ్డాయి. ఇందులో భాగంగా ప్రభు త్వం ఖాళీ స్థలాలపై పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని కమిషన ర్లను ఆదేశించింది. ఈ మేరకు వసూళ్లపై అధికారులు దృష్టి సారించా రు. పన్నులు చెల్లించని భూ యాజమానుల వివరాలు సేకరిస్తున్నారు.Updated Date - 2021-10-20T05:38:03+05:30 IST