గిరిజనులకు రేషన్‌ కష్టాలు

ABN , First Publish Date - 2021-10-20T05:01:12+05:30 IST

గిరిజనులకు రేషన్‌ కష్టాలు

గిరిజనులకు రేషన్‌ కష్టాలు
కుమ్మిచెట్టు బస్‌షెల్టర్‌లో నెట్‌వర్క్‌ కోసం పడుతున్న అవస్థలు

మెళియాపుట్టి : గిరిజనులకు రేషన్‌ కష్టాలు తప్పడం లేదు. ఇందుకు ఈ ఫొటోయే నిదర్శనం. కొండలపై గల గ్రామాల ప్రజలు రేషన్‌ సరుకుల కోసం కిందికి వచ్చి నానా అవస్థలు పడుతున్నారు. నెట్‌వర్క్‌ సరిగా లేకపోవడం, వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. నేలబొంతు, డబారు డిపో పరిధిలోని అంపురం, గొట్టిపట్టి, కేరసింగి గ్రామ పంచాయతీల పరిధిలోని సుమారు 20 గ్రామాల ప్రజలకు ప్రతి నెలా ఈ అవస్థలు తప్పడం లేదు. సిగ్నల్‌ సమస్యతో మంగళవారం పెద్దపద్మాపురం జంక్షన్‌లో గల కుమ్మచెట్టు బస్‌స్టాఫ్‌ ఇలా రేషన్‌ సరుకులు ఇచ్చేందుకు పడుతున్న కష్టాలు ‘ఆంధ్రజ్యోతి’ కెమెరాకు చిక్కాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-10-20T05:01:12+05:30 IST