ఉణుకూరు కుర్రాడు లాసెట్‌లో మెరిశాడు

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

లాసెట్‌లో జిల్లా విద్యార్థి కడగల కృష్ణంనాయుడు విశేష ప్రతిభ చూపాడు. ఎల్‌ఎల్‌ఎం (పీజీ) ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. రేగిడి మండలం ఉణుకూరు గ్రామానికి చెందిన కృష్ణంనాయుడుది సామాన్య వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు అప్పలనాయుడు, ఆదిలక్ష్మిలు సాధారణ వ్యవసాయ కూలీలు.

ఉణుకూరు కుర్రాడు లాసెట్‌లో మెరిశాడు




రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించిన కృష్ణంనాయుడు

రేగిడి/రణస్థలం, అక్టోబరు 21: లాసెట్‌లో జిల్లా విద్యార్థి కడగల కృష్ణంనాయుడు విశేష ప్రతిభ చూపాడు. ఎల్‌ఎల్‌ఎం (పీజీ) ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. రేగిడి మండలం ఉణుకూరు గ్రామానికి చెందిన కృష్ణంనాయుడుది సామాన్య వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు అప్పలనాయుడు, ఆదిలక్ష్మిలు సాధారణ వ్యవసాయ కూలీలు. వీరికి ముగ్గురు కుమారులుకాగా... కృష్ణంనాయుడు చిన్నవాడు. ఇటీవలే ఆంధ్రా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశాడు. ఈ ఏడాది సెప్టెంబరు 22న పద్మావతి మహిళా యూనివర్సిటీ (తిరుపతి) నిర్వహించిన ఏపీ లాసెట్‌ రాశాడు. గతంలో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షలో ఐదో ర్యాంకు సాధించాడు.  పదో తరగతి వరకూ ఏవీపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుకోగా..కాకినాడ ఆదిత్యలో ఇంటర్‌ ఎంఈసీ పూర్తిచేశాడు. చిన్నప్పటి నుంచి న్యాయవాద వృత్తిపై మక్కువ పెంచుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న చిన్నాన్నలు, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్టు కృష్ణంనాయుడు చెబుతున్నాడు. న్యాయశాస్త్రంలో ఉన్నతంగా రాణించాలన్నదే తన లక్ష్యమని కృష్ణంనాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

ఐదేళ్ల కోర్సులో‘నాగసాయి ప్రశాంతి’ ప్రతిభ

 ఐదేళ్ల లా విభాగ ప్రవేశ పరీక్షలో బంటుపల్లి గ్రామానికి చెందిన వెలిచేటి నాగసాయి ప్రశాంతి ప్రతిభ చూపింది. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించింది. స్థానికంగా పదో తరగతి చదివిని ఆమె...ఇంటర్‌ శ్రీకాకుళంలోని శ్రీచైతన్య జూని యర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తిచేసింది. ప్రాథమిక స్థాయి నుంచి న్యాయశాస్త్రం అంటే మక్కువ పెంచుకుంది. పద్మావతి యూనివర్సిటీ నిర్వహించిన లాసెట్‌కు హాజరై ఈ ఘనత సాధించింది. తల్లిదండ్రులు వెలిచేటి కామేశ్వరరావు, పద్మజాలతో పాటు గ్రామపెద్ద నడికు దిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) ప్రోత్సాహంతోనే తాను ఈ ఘనత సాధించినట్టు నాగసాయి ప్రశాంతి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 



Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST