ఏసమయంలోనైన ఎన్నికల రావచ్చు: రామ్మోహన్ నాయుడు

ABN , First Publish Date - 2021-12-30T21:04:20+05:30 IST

రాష్ట్రంలో ఏసమయంలోనైన ఎన్నికలు రావచ్చునని ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏసమయంలోనైన ఎన్నికల రావచ్చు: రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో అవమానించినా ధీటుగా ఎదుర్కొంటున్నారని ఎంపీ రామ్మోన్ నాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళంలో జరిగిన పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏసమయంలోనైన ఎన్నికలు రావచ్చునని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ సిద్దంగా ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈసారి టీడీపీకి 151 సీట్లకుపైగా రావాలన్నారు. తెలుగు దేశం జండా చూస్తే వైఎస్సార్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాలన్నారు. మనం భయపడే రోజులు పోయాయని, జగన్మోహన్ రెడ్డి భయపడే రోజులు వచ్చాయన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని రామ్మోన్ నాయుడు హామీ ఇచ్చారు.

Updated Date - 2021-12-30T21:04:20+05:30 IST