వాల్మీకి రామాయణం ఆదర్శం
ABN , First Publish Date - 2021-10-21T05:17:44+05:30 IST
వాల్మీకి రచించిన రామాయణం ప్రపంచంలో ఆదర్శ గ్రంథం గా నిలిచిందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎంఆర్ జ్యోతిఫెడ్రరిక్ అన్నారు. బుధవారం కళాశాల లో వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతీ య సంస్కృతీ, సంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇవ్వ డంతో పాటు యువత సన్మార్గంలో నడిచేందుకు వాల్మీకి జీవితం ఆదర్శంగా ఉంటుందన్నారు.

నరసన్నపేట, అక్టోబరు 20: వాల్మీకి రచించిన రామాయణం ప్రపంచంలో ఆదర్శ గ్రంథం గా నిలిచిందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎంఆర్ జ్యోతిఫెడ్రరిక్ అన్నారు. బుధవారం కళాశాల లో వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతీ య సంస్కృతీ, సంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇవ్వ డంతో పాటు యువత సన్మార్గంలో నడిచేందుకు వాల్మీకి జీవితం ఆదర్శంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ టెక్కలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించారు. ప్రిన్సి పాల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన రచించిన వాల్మీకి మహర్షిని గూర్చి వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సతీష్, ఐక్యూ కో-ఆర్డినేటర్ పాల్, నాక్ కో-ఆర్డి నేటర్ ఎ.రామారావు, అధ్యాపకులు కె.శ్రీనివాసులు, లీలా పద్మజ, బాలకృష్ణ పాల్గొన్నారు.