జిల్లా వ్యాప్తంగా వర్షం

ABN , First Publish Date - 2021-11-03T05:18:37+05:30 IST

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడ్డాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏకదాటిగా చినుకులు పడ్డాయి. సాయంత్రానికి కాస్తా తెరిపినిచ్చింది. తీర, మైదాన గ్రామాల్లో స్వల్పంగా గాలులు వీచాయి.

జిల్లా వ్యాప్తంగా వర్షం
శ్రీకాకుళం నగరంలో వర్షం పడుతున్న దృశ్యం

రైతుల్లో ఆందోళన

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, నవంబరు 2: అల్పపీడనం ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడ్డాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏకదాటిగా చినుకులు పడ్డాయి. సాయంత్రానికి కాస్తా తెరిపినిచ్చింది. తీర, మైదాన గ్రామాల్లో స్వల్పంగా గాలులు వీచాయి. దీంతో చాలా మండలాల్లో వరి నేలకొరిగింది. నదీ పరీవాహక ప్రాంతాలు, కాలువల చెంతనే ముందుగా ఉబాలు పూర్తయిన వరికి సంబంధించి చేను వచ్చింది. దీంతో తేలికపాటి రకాల వరి గాలులకు నేలవాలింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాటిని నిలబెట్టేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. హిరమండలం, జలమూరు, నరసన్నపేట, పోలాకి, సారవకోట, కోటబొమ్మాళి మండలాల్లో కొద్దిరోజుల్లో వరి కోతలకు సిద్ధమయ్యారు. వర్షంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజుల పాటు అల్పపీడన ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేదు. కాగా మంగళవారం బూర్జ మండలంలో అత్యధికంగా 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సీతంపేట మండలంలో అత్యల్పంగా 0.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఉదయం నుంచి పడిన చిరుజల్లులతో శ్రీకాకుళం నగర వాసులు అసౌకర్యానికి గురయ్యారు. 


Updated Date - 2021-11-03T05:18:37+05:30 IST