వైసీపీ అరాచకాలను ప్రశ్నించండి

ABN , First Publish Date - 2022-01-01T04:51:28+05:30 IST

వైసీపీ అరాచకాలను ప్రశ్నించండి

వైసీపీ అరాచకాలను ప్రశ్నించండి
మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు, పక్కన ఎంపీ రామ్మోహన్‌నాయుడు

- కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపు

టెక్కలి, డిసెంబరు 31: అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నించే స్థాయిలో కార్యకర్తలు ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కలి శేరివీధిలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విస్మరిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.3వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.2,500తో సరిపెడుతున్నారు. వైసీపీ నాయకులు కళ్లు నెత్తికెత్తి.. గ్రామస్థాయిలో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. ఇటువంటి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని కార్యకర్తలకు అచ్చెన్న పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం వేధిస్తున్న వారిపై అంతకు రెట్టింపు బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోతున్నారని తెలిపారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలనూ మోసగిస్తోందని విమర్శించారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలపై కార్యకర్తలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలపార్టీల అధ్యక్షులు బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, జీరు భీమారావు, బోయిన రమేష్‌, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు దాసునాయుడు, మామిడి రాము, కోళ్ల లవకుమార్‌, కామేషు, పురుషోత్తం, రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-01T04:51:28+05:30 IST