అంబులెన్సుల అందజేత

ABN , First Publish Date - 2021-05-07T05:29:12+05:30 IST

నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం అంబులెన్స్‌ (నేషనల్‌ అడ్వాన్సుడ్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌) సేవలు గురువారం ప్రారంభమయ్యాయి.

అంబులెన్సుల అందజేత
కలెక్టరేట్‌/ ఇచ్ఛాపురం : అంబులెన్స్‌లు ప్రారంభిస్తున్న కలెక్టర్‌

కలెక్టరేట్‌/ ఇచ్ఛాపురం: కొవిడ్‌ బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు ఉద్దానం ఫౌండేషన్‌ రెండు అంబులెన్సులను గురువారం అందజేసింది. ఈవాహన పత్రాలను ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌, ఫౌండేషన్‌ కన్వీనర్‌ పిరియా విజయలు కలెక్టర్‌ జె.నివాస్‌కు అందజేశారు. ఈ వాహనాలను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అదే విధంగా ఇచ్ఛాపురం మండలానికి సం బంధించి మరో అంబులెన్స్‌ను తహసీల్దార్‌ మురళీమోహన్‌రావుకు అందజేశారు.


నవజాత శిశువుల కోసం..

పాలకొండ  : నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం అంబులెన్స్‌ (నేషనల్‌ అడ్వాన్సుడ్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌) సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ అంబులెన్స్‌లో ఇన్బిల్ట్‌ ఇంకుబేటర్‌, నియోనాటల్‌ అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతికత వైద్య పరికరాలతో వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సిలెండర్‌ తదితర పరికరాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని టెక్కలి, పాలకొండ పరిధిలో వీటిని అందుబాటులోకి తెచ్చారు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి 45 రోజుల వయసు గల పిల్లలకు ఎటువంటి సమస్య వచ్చినా 108కు డయిల్‌ చేస్తే అంబులెన్స్‌ సిద్ధంగా సిబ్బంది పేర్కొన్నారు. 



 

Updated Date - 2021-05-07T05:29:12+05:30 IST