నిరసన హోరు

ABN , First Publish Date - 2021-12-08T05:28:44+05:30 IST

పీఆర్సీ అమలుతో పాటు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఔట్‌సోర్సింగ్‌, పింఛనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

నిరసన హోరు
సరుబుజ్జిలి పాఠశాల వద్ద నిరసనలో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ తదితరులు

 పీఆర్సీ ప్రకటించాలి  

రెవెన్యూ  కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఉద్యోగులు, టీచర్ల ధర్నా  


(ఆంధ్రజ్యోతి బృందం)

పీఆర్సీ అమలుతో పాటు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఔట్‌సోర్సింగ్‌, పింఛనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ పిలుపు మేరకు రెవెన్యూ కార్యాలయాలతో పాటు పాఠశాలల ఎదుట రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్సీ, డీఏ బకాయిలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 


Updated Date - 2021-12-08T05:28:44+05:30 IST