రోడ్ల దుస్థితిపై నిరసన గళం

ABN , First Publish Date - 2021-07-25T05:20:38+05:30 IST

రహదారుల దుస్థితిపై టీడీపీ శ్రేణులు గళమెత్తాయి. శనివారం పాతపట్నం నియోజకవర్గం కొత్తూరుతో పాటు రాజాం, పాలకొండలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. గోతులమయంగా ఉన్న రహదారులను పూడ్చడంతో పాటు వరి నాట్లు వేశారు. ప్రభుత్వం రహదారుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.

రోడ్ల దుస్థితిపై నిరసన గళం
పాలకొండ: రోడ్డు గుంతల్లో వరి నాట్లు వేస్తున్న టీడీపీ నాయకులు

రోడ్ల  నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం

ప్రజా ప్రయోజనాలు వదిలి  దుబారాకు ప్రాధాన్యం

కొత్తూరు, పాలకొండ, రాజాంలో  టీడీపీ నేతల ఆందోళన

పాలకొండ: రాష్ట్రంలో రహదారులు నరకకూపాలుగా మారాయని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రాజాం-పాలకొండ రోడ్డుపై శనివారం టీడీపీ నేతలు నిరసన తెలిపారు. రోడ్డు గుంతల వద్ద వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ టీడీపీ హయాంలో నిర్మించిన రోడ్లు తప్ప...కొత్తగా ఎక్కడైనా వేశారా అని ప్రశ్నించారు. ప్రధాన, గ్రామీణ రహదారులు చెరువులను తలపిస్తున్నా యన్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చి ప్రజాధ నాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అవసరా లను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిం చారు. రహదారులతో ప్రజలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటి కైనా వైసీపీ ప్రజా ప్రతినిధులు కళ్లు తెరవాలన్నారు. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నేన అప్పలనాయుడు, అరకు పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షుడు వారాడ సుమంత్‌నాయుడు, టీడీపీ నేతలు గ ంటా సంతోష్‌, వెన్నపు శ్రీను, కిమిడి కాశీంనాయుడు, జాడ శ్రీధర్‌, వరలహాల నాయుడు, రమణ మూర్తి, జయశంకర్‌, మహేంద్ర, వెంకటేష్‌, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 


ప్రభుత్వం దుబారాకు ప్రాధాన్యం ఇస్తోంది

రాజాం: రాష్ట్ర ప్రభుత్వం దుబారాకు ప్రాధాన్యమిస్తోందని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని బొబ్బిలి రోడ్డులో నిరసన తెలి పారు. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు జడ్డు విష్ణుమూర్తి మాట్లా డుతూ ప్రజలకు శాశ్వత ప్రయోజనమిచ్చే ప్రాజెక్టులను, పనుల ను పక్కన పెట్టి... పథకాల పేరిట నగదు పంచి పెట్టడం ఆందోళన కలిగి స్తోందన్నారు. రాజాం పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరుగు తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు అసౌ కర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి రోడ్డు కూలి ఒక వ్యక్తి మృతి చెందాడని.. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. మూల్యం చెల్లించుకోక తప్పద న్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురవాన నారాయణరావు, వంగా వెంకటరావు, టంకాల నాగరాజు, అంపోలు శ్రీను, శాసపు రమేష్‌, అడప శ్రీను, మరిపి జగన్మోహన్‌రావు, అద్దంకి గోపి తదితరులు పాల్గొన్నారు

 


 

Updated Date - 2021-07-25T05:20:38+05:30 IST