చిన్నారుల బడి బాట

ABN , First Publish Date - 2021-02-02T04:32:25+05:30 IST

ప్రాథమిక పాఠశాలలు ఎట్టకేలకు తెరచుకున్నాయి. సోమవారం నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు బోధన ప్రారంభమైంది. పిల్లలంతా మాస్కులతో హాజరయ్యారు. భౌతిక దూరం పాటించేలా ఉపాధ్యాయు

చిన్నారుల బడి బాట
పాఠశాలలకు హాజరైన చిన్నారులు




తెరచుకున్న ‘ప్రాథమిక’ పాఠశాలలు
తొలిరోజు 1,83,590 మంది విద్యార్థుల హాజరు
(గుజరాతీపేట)

ప్రాథమిక పాఠశాలలు ఎట్టకేలకు తెరచుకున్నాయి.
సోమవారం నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు బోధన ప్రారంభమైంది. పిల్లలంతా మాస్కులతో హాజరయ్యారు. భౌతిక దూరం పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. కరోనా ప్రభావంతో గత ఏడాది మార్చి 19 నుంచి వీరికి సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ఆరు నుంచి పదో తరగతి వరకు గత ఏడాది నవంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి 18 వరకు వివిధ దశల్లో తరగతులు ప్రారంభించి బోధన సాగిస్తున్నారు. ఒకటి నుంచి ఐదు వరకు చిన్నారులకు సోమవారం బోధన ప్రారంభించారు. తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలతో ఉపాధ్యాయులు పాఠశాలకు అనుమతించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు 1,85,799 మంది ఉండగా, తొలిరోజు 1,83,590 మంది  తరగతులకు హాజరయ్యారని ఉపవిద్యా శాఖాధికారి పగడాలమ్మ తెలిపారు.  కొవిడ్‌ నిబంధనలనుసరించి తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.  




Updated Date - 2021-02-02T04:32:25+05:30 IST