‘ప్రాథమిక పాఠశాలల ఎత్తివేత తగదు’

ABN , First Publish Date - 2021-06-22T05:27:32+05:30 IST

గ్రామాల్లోని పాఠశాలలను ఎత్తివేయాలన్న ఆలోచన తగదని, దీనిని విరమించుకోవాలని గోపాలపురం గ్రామస్థులు కోరారు. ఈ మేరకు ఎంఈవో బి.రవికి సోమవారం వినతిపత్రాలు అం దించారు.

‘ప్రాథమిక పాఠశాలల ఎత్తివేత తగదు’
మండలపరిషత్‌ ఏవోకి వినతిపత్రం అందిస్తున్న ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు

రాజాం, జూన్‌ 21: గ్రామాల్లోని పాఠశాలలను ఎత్తివేయాలన్న ఆలోచన తగదని, దీనిని విరమించుకోవాలని గోపాలపురం గ్రామస్థులు కోరారు. ఈ మేరకు ఎంఈవో బి.రవికి సోమవారం వినతిపత్రాలు అం దించారు. ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠ శాలల్లో కలపాలనే ఆలోచన వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని ఎంఈవో హామీ ఇచ్చారు. అనంతరం యూటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యుడు రెడ్డి మోహనరావు తదితరులను కలిసి  ఈ విషయమై సం ఘం తరఫున పోరాటం చేయాలని కోరారు. కార్యక్రమంలో జి.రమేష్‌,  కొన్న తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు 


విలీన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి

నందిగాం: గ్రామాల్లోని 3, 4, 5 తరగతులను హైస్కూలులో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఏపీటీఎఫ్‌-1938 సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఈ మేరకు సోమవారం మండలపరిషత్‌ పరిపాలనాధికారి ఆర్‌.సుధారాణికి ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు బి.నారా యణరావు, జి.వెంకట శ్రీనివాసరావు, సీహెచ్‌ కృష్ణారావు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతారన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం మాధ్యమం ఎంపిక చేసుకునే హక్కు ప్రతి విద్యార్థికి ఉందన్నారు. పరిశీలించి మార్పు లు, సవరణలు చేపట్టాలని వారు కోరారు.  కార్యక్రమంలో టి.జోగారావు, ఎస్‌.పాపారావు, టి.ఫాల్గుణరావు, పి.సుభాష్‌బాబు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-06-22T05:27:32+05:30 IST