నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ABN , First Publish Date - 2021-05-09T04:56:25+05:30 IST

పోలాకి మండలం మబుగాం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏడీఈ రామునాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నరసన్నపేట: పోలాకి మండలం మబుగాం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏడీఈ రామునాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్‌ స్టేషన్‌లో మెయింట్‌నెన్స్‌ పనులు చేపడుతున్నామన్నారు. దీనివల్ల మబుగాం, ఈదులవలస, రాళ్లపాడు, దీర్ఘాశి, గొల్లలవలస, సంతలక్ష్మీపురం, తలసముద్రం, వనితమండలాల్లోని గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్‌ ఉండదని, ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు. 


 

Updated Date - 2021-05-09T04:56:25+05:30 IST