పైడితల్లమ్మా...... కరుణించమ్మా!
ABN , First Publish Date - 2021-03-22T03:59:45+05:30 IST
ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మ జాతర మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

రాజాంలో ‘పోలిపల్లి’ జాతరకు పోటెత్తిన భక్తులు
రాజాం/రూరల్, మార్చి21: ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మ జాతర మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజాంలోని ఆలయం వద్ద వేకువజామున ఐదుగంటల నుంచే భక్తులు బారులుదీరారు. ప్రత్యేక, ఉచిత క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పైడితల్లమ్మా.. కరుణించవమ్మా అంటూ వేడుకున్నారు. ఆలయానికి ఎదురుగా వనం గుడి వద్ద కూడా మహిళలు దీపారాధన చేశారు. ఆలయం వెనుక భాగంలో భక్తులు తలనీలాలు సమర్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. రాజాం సీఐ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ నవీన్‌కుమార్ పర్యవేక్షణలో ఎస్‌ఐ రేవతి, సిబ్బంది పహారా నిర్వహించారు. అమ్మవారి ఆలయ చరిత్రలోనే తొలిసారిగా జాతరను ప్రజలు నేరుగా తమ ఇళ్లల్లోని టీవీల్లో చూసేలా ‘లైవ్’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తృప్తి రిసార్ట్స్ అధినేత మురళీ మాస్టర్ ఇందుకు సహకారం అందించారు. జాతరలో సర్కస్‌లు వాహన విన్యాసాలు, జంతు ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఫొటో : శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి పూజలు చేస్తున్న ప్రధాన అర్ఛకులు 21ఆర్‌జెపి10
అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు 21ఆర్‌జెపి11 12,
అమ్మవారి వనంగుడి వద్ద పూజలు చేస్తున్న భక్తులు 21ఆర్‌జెపి13
లైవ్ ఏర్పాట్లు 21ఆర్‌జెపి14