ఆలయాల్లో శ్రావణ శోభ

ABN , First Publish Date - 2021-09-04T05:24:10+05:30 IST

ఆలయాల్లో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సంత తోటలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు చేపట్టారు.

ఆలయాల్లో శ్రావణ శోభ
నరసన్నపేటలో కుంకుమ పూజలు చేస్తున్న మహిళలు

నరసన్నపేట: ఆలయాల్లో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సంత తోటలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా సామూ హిక కుంకుమార్చనలు చేపట్టారు. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సంతోషిమాత, ఉమామహేశ్వర స్వామి, వాసవి కన్యకా పరమేశ్వరి, కామేశ్వరి స్వామి ఆలయాల్లోనూ పూజలు చేపట్టారు. ఆయా గ్రామాల భక్తులు పాల్గొన్నారు.


సామూహిక కుంకుమ పూజలు

శ్రీముఖలింగం (జలుమూరు):  శ్రీముఖలింగం వారాహి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుని ప్రత్యేక పూజలు చేశారు. చల్లవానిపేట సంతోషిమాత ఆలయం, అల్లాడ వేంకటేశ్వర ఆలయంలోను భక్తులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు పెద్దలింగన్న, నారాయణమూర్తి, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-04T05:24:10+05:30 IST