క్రీడా స్థలాలను పరిరక్షించాలి
ABN , First Publish Date - 2021-10-21T05:15:22+05:30 IST
ఆలాంధ్రరోడ్ కూడలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాలలకు చెందిన క్రీడా స్థలాలను పరిరక్షించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బస్టాండ్ కూడలి నుంచి ఆలాంధ్రరోడ్ కూడలి వరకు ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు.

పాతపట్నం, అక్టోబరు 20: ఆలాంధ్రరోడ్ కూడలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాలలకు చెందిన క్రీడా స్థలాలను పరిరక్షించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బస్టాండ్ కూడలి నుంచి ఆలాంధ్రరోడ్ కూడలి వరకు ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి క్రీడా స్థలాల్లో ఆక్రమణలను తొలగించి పాఠశాలకు అప్పగించాలని నినదించారు. అనంతరం తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి గేదెల చైతన్య, యువత పాల్గొన్నారు.