మొక్కలు నాటేందుకు ప్రణాళికలు

ABN , First Publish Date - 2021-07-24T05:55:01+05:30 IST

మొక్కలు నాటేందుకు ప్రణాళికలు

మొక్కలు నాటేందుకు ప్రణాళికలు
ఉపాధి సిబ్బందితో మాట్లాడుతున్న డ్వామా పీడీ కూర్మారావు

- త్వరలో ఉపాధి వేతన బకాయిల చెల్లింపు

- డ్వామా పీడీ కూర్మారావు

లావేరు, జూలై 23: జిల్లాలో ఈ ఏడాది మూడువేల ఎకరాల్లో జీడి మామిడి, కొబ్బరి, తదితర ఉద్యానవన మొక్కలు నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు డ్వామా పీడీ హనుమంతు కూర్మారావు తెలిపారు. శుక్రవారం ఆయన లావేరు ఉపాధి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ఎకరా విస్తీర్ణంలో జీడి మామిడి పెంపకానికి మొదటి ఏడాది రూ.45,221.. రెండో ఏడాది రూ.29,986.. మూడో ఏడాది రూ27,986 చొప్పున చెల్లించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా జగనన్న పచ్చతోరణం పథకంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది రెండు వేల కిలోమీటర్ల పొడవునా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని (ఎవెన్యూప్లాంటేషన్‌) లక్ష్యంగా పెట్టుకున్న ట్లు చెప్పారు. ఒక కిలో మీటరుకు నాలుగు వందల మొక్కల  చొప్పున నాట నున్నట్లు పేర్కొన్నారు.  వచ్చే ఆగస్టు నెలాఖరు నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. ఈ మొక్కలను సంరక్షించేందుకు  మొదటి ఏడాది రూ.1.20 లక్షలు, రెండో ఏడాది రూ.80 వేలు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఉపాధి కూలీలకు రావాల్సిన ఆరు వారాల వేతన బకాయిలను త్వరలో చెల్లిస్తా మన్నారు. కార్యక్రమంలో ఇస్రోశాస్త్రవేత్త సురేష్‌, ఏపీడీ పొన్నాడ శైలజ, ఎంపీడీవో బొడ్డేపల్లి మధుసూదనరావు, ఏపీవో రెడ్డి సత్యవతి,  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-24T05:55:01+05:30 IST