పనితీరు మెరుగుపడాలి
ABN , First Publish Date - 2021-12-10T05:06:33+05:30 IST
సచివాలయాల సిబ్బంది పనితీరు మెరుగుపడాలని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి అన్నారు. కొత్తపల్లి, బెల్లుపటియా, కొంకడాపుట్టి సచివాలయాలను ఆయన గురువారం పరిశీలించారు.

హరిపురం : సచివాలయాల సిబ్బంది పనితీరు మెరుగుపడాలని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి అన్నారు. కొత్తపల్లి, బెల్లుపటియా, కొంకడాపుట్టి సచివాలయాలను ఆయన గురువారం పరిశీలించారు. సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, సంక్షేమ పథకాల కేటాయింపులు, ఈ-సర్వీసెస్, కొవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయా సచివాలయ భవన నిర్మాణ పనులను తనిఖీలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమలరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.