సనాతన ఆచారాలను పాటించాలి

ABN , First Publish Date - 2021-12-20T04:51:33+05:30 IST

ప్రతి ఒక్కరూ సనాతన ఆచారాలను పాటించాలని విజయనగరం జిల్లా నెల్లిమర్ల దుర్గామహా పీఠాధిపతులు సమతానంద స్వామీజీ, శ్రావణ చైతన్యానంద స్వామీజీ కోరారు.

సనాతన ఆచారాలను పాటించాలి
దత్త ప్రవచన పుస్తకాలను ఆవిష్కరిస్తున్న స్వామీజీలు

నెల్లిమర్ల దుర్గా మహాపీఠాధిపతులు

రేగిడి: ప్రతి ఒక్కరూ  సనాతన ఆచారాలను పాటించాలని విజయనగరం జిల్లా నెల్లిమర్ల దుర్గామహా పీఠాధిపతులు సమతానంద స్వామీజీ,  శ్రావణ చైతన్యానంద స్వామీజీ కోరారు. రేగిడి దత్తపీఠంలో ఆదివారం దత్తజయంతి సందర్భంగా దత్తజ్ఞాన బోధ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించ డం వల్ల సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. దత్తపాదుకా పూజ,  గణపతి హోమం, పండితుల సత్కారం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ చేపట్టారు. కార్యక్రమంలో దత్తపీఠం అధ్యక్ష, కన్వీనర్‌లు కిమిడి సత్యనారాయణ, రుంకు శ్రీనివాసరావు, ప్రతినిధులు వై.భాస్కరరావు, కె మురళీ,  జల్లు శివ, దామోదర రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-20T04:51:33+05:30 IST