పాఠ్యాంశ రచనకు ‘కొయ్యల’కు అవకాశం

ABN , First Publish Date - 2021-10-29T05:01:48+05:30 IST

కొత్తగా రానున్న 8వ తరగతి జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశ రచనకు బ్రాహ్మ ణతర్లా జడ్పీ హైస్కూల్‌కు చెందిన సైన్స్‌ ఉపాధ్యాయుడు కొయ్యల శ్రీనివాసరావు ఎంపికయ్యారు.

పాఠ్యాంశ  రచనకు ‘కొయ్యల’కు అవకాశం
కొయ్యల శ్రీనివాసరావు

బ్రాహ్మణతర్లా(పలాసరూరల్‌) : కొత్తగా రానున్న 8వ తరగతి జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశ రచనకు బ్రాహ్మణతర్లా జడ్పీ హైస్కూల్‌కు చెందిన సైన్స్‌ ఉపాధ్యాయుడు కొయ్యల శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఈనెల 21న అమరా వతిలో విద్యా శాఖామంత్రి ఎ.సురేష్‌ అధ్యక్షతన జరిగిన ప్రాథమిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 30 నుంచి రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధన మండలి (ఎస్‌సీఈ ఆర్‌టీ)లో నిర్వహించే వర్క్‌షాపులో శ్రీనివాసరావు పాల్గొంటారు. ఈయన ఇప్పటికే 8, 9, 10 తరగతి జీవశాస్త్ర క్యూఆర్‌ కోడ్‌ ఎనరైజింగ్‌ టెక్స్ట్‌ బుక్స్‌, 2019లో ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించే ఉపాధ్యాయుల మాడ్యూల్‌ రూపకల్పనలో పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-29T05:01:48+05:30 IST