ఒంకులూరులో ఆలీవ్‌రిడ్లే తాబేళ్ల గుడ్లు సంరక్షణ

ABN , First Publish Date - 2021-03-25T05:15:36+05:30 IST

సముద్రం నుంచి తీరానికి వచ్చి ఆలివ్‌రిడ్లే తాబేళ్లు పెడుతున్న గుడ్లను ఒంకులూరు యువకులు సంరక్షి స్తున్నారు.

ఒంకులూరులో ఆలీవ్‌రిడ్లే తాబేళ్ల గుడ్లు సంరక్షణ
సముద్రంలోకి తాబేళ్లు పిల్లలను విడిచిపెడుతున్న యువకులు

వజ్రపుకొత్తూరు:  సముద్రం నుంచి తీరానికి వచ్చి ఆలివ్‌రిడ్లే  తాబేళ్లు పెడుతున్న గుడ్లను ఒంకులూరు యువకులు  సంరక్షి స్తున్నారు. ఏటా నవంబరు,  డిసెంబరు, జనవరిలో ఒడ్డుకు వచ్చి ఇసుక తిన్నెల్లో గుడ్లను పెట్టి తిరిగి  వెళ్లిపోతాయి. ఇలా  పెట్టిన  గుడ్లను కుక్కలు, నక్కలు, ఎలుగుబంట్ల నుంచి రక్షించి అవి తాబేళ్లుగా అయిన తరువాత సముద్రంలో విడిచిపెడుతున్నట్లు, ఇప్పటివరకు 10 వేల పిల్లలను విడిచిపెట్టినట్లు సండుపల్లి మోహన్‌ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం 100 తాబేళ్ల పిల్లలను సుముద్రంలోకి పంపినట్లు చెప్పారు.

  

 

Updated Date - 2021-03-25T05:15:36+05:30 IST