సంచాంలో ప్రభుత్వ స్థలం కబ్జా

ABN , First Publish Date - 2021-08-28T05:26:47+05:30 IST

సంచాంలో ప్రభుత్వ స్థలం కబ్జా

సంచాంలో ప్రభుత్వ స్థలం కబ్జా
కబ్జాకు గురైన స్థలం ఇదే

రణస్థలం, ఆగస్టు 27: సంచాం రెవెన్యూ పరిధిలోని మూడు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని పైడిభీమవరం పంచాయతీకి చెందిన ఓ వార్డు మెంబరు  కబ్జా చేశాడు. ఎంచక్కా ఇంటి నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కూడా చేసేశాడు. 326-5 సర్వే నెంబరులో పైడిభీమవరం గ్రామానికి చెందిన 84 మందికి జగనన్న కాలనీ కింద ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అయితే, ఇక్కడ పట్టా లేకపోయినా ఓ వార్డు మెంబరు మాత్రం తన రాజకీయ బలంతో సుమారు 3 సెంట్ల స్థలాన్ని ఆక్రమించాడు. ఈ స్థలంలో ఉన్న తాగునీటి పైపులైన్‌ను విరిచేసి ఇం టి నిర్మాణం కోసం గోతులు తవ్వారు. దీంతో పైపులైన్‌ ద్వా రా నీరు రాకపోవడంతో మిగతా వారు ఇళ్ల పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఆ కబ్జాదారుడిని అడి గేందుకు భయపడుతున్నారు. అధికారులు స్పందించి  చర్య లు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ ఎం.సుధారాణి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఆ స్థలంలో వేరేవారికి  పట్టాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. 

 

Updated Date - 2021-08-28T05:26:47+05:30 IST