టీడీపీ నేతలకు నోటీసులు
ABN , First Publish Date - 2021-11-05T05:30:00+05:30 IST
కొవిడ్ నిబంధనలను అతిక్రమించి అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టిన సంఘటనలో పలువురు టీడీపీ నేలకు శుక్రవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు.

టెక్కలి రూరల్: కొవిడ్ నిబంధనలను అతిక్రమించి అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టిన సంఘటనలో పలువురు టీడీపీ నేలకు శుక్రవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 2న నందిగాంలో టీడీపీ నేతల విగ్రహావిష్కరణకు సంబంధించి కొవిడ్ నిబంధనలను పాటించకుండా, ర్యాలీకి అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడంపై టెక్కలికి చెందిన టీడీపీ నేతలక నోటీసు లిచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్లు ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు. టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు బగాది శేషగిరి, కోళ్ల లవకుమార్‌తో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేశారు.