దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోని రోడ్డు
ABN , First Publish Date - 2021-11-29T04:25:43+05:30 IST
తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడి నుంచి అనంతపురం వెళ్లే పంచాయతీ శాఖ రోడ్డు మార్గం పరమ అధ్వానంగా మారింది.

ఫనరకం చూపుతున్న అనంతపురం రోడ్డుఫ పట్టించుకోని పాలకులు, అధికారులు
తోటపల్లిగూడూరు, నవంబరు 22 : తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడి నుంచి అనంతపురం వెళ్లే పంచాయతీ శాఖ రోడ్డు మార్గం పరమ అధ్వానంగా మారింది. 40 ఏళ్ల నుంచి ఈ రోడ్డు బాగోగుల గురించి అటు పాలకులు గానీ, ఇటు అఽధికా రులు గానీ, చివరకు రాకపోకలు సాగించే భారీ వాహనాల వాటర్ బేస్ రొయ్యల కంపెనీ సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. వరకవిపూడి నుంచి అనంతపురం వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఈ రోడ్డు ఉంటుంది. భూతద్దం పెట్టి ఎంత వెతికినా మచ్చుకైనా బాగున్న ప్రదేశం ఈ రోడ్డుపై కనిపించదు. ఈ రోడ్డు మీదుగా ముత్తుకూరు, కృష్ణపట్నం గ్రామాలకు భారీ వాహనాలతోపాటు ఫోర్‌వీల్ వాహ నాలు, వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు రాకపోకలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రోడ్డుపై ప్రయాణం అత్యంత ప్రమాదంగా మారడంతో వాహనాల చోదకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.
వాటర్ బేస్ వల్లే రోడ్డు ధ్వంసం
అనంతపురంలో ఉన్న వాటర్ బేస్ రొయ్యల పాలన సంస్థ వల్లే ఈ రోడ్డు ధ్వంసం అయిందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కంపెనీకి వివిధ రాష్ట్రాల నుంచి అధిక లోడుతో భారీ వాహనాలలు రాకపోకలు సాగిస్తుంటాయి. దాంతో అంతంత మాత్రంగా ఉన్న ఈ రోడ్డు మరింతగా దెబ్బతింది. అయితే రోడ్డు మరమ్మతులను చేపట్టడంలో ఆ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రామస్థులు అంటున్నారు. కనీసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను కూడా రోడ్డు బాగోగుల కోసం వ్యయం చేయలేని కంపెనీ యాజమాన్యంపై గ్రామస్తులు, వాహనాల యజమానులు, చోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కంపెనీ యాజమాన్యమే దొంగ లెక్కలు చూపెట్టి సీఎస్‌ఆర్ నిధులను స్వాహా చేస్తోందని తెలుస్తోంది. యుద్ధప్రాతిపదికన రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోతే భవిష్యత్తులో పలు గ్రామాలకు రాకపోకలు తెగే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీఎస్‌ఆర్ నిధులను దుర్వినియోగం చేస్తున్న కంపెనీపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.