కోరం ఉన్నా.. పీఎంసీ ఎన్నికకు నో

ABN , First Publish Date - 2021-10-07T06:04:46+05:30 IST

కోరం ఉన్నా.. పీఎంసీ ఎన్నికకు నో

కోరం ఉన్నా.. పీఎంసీ ఎన్నికకు నో
పాఠశాల వద్ద పోలీసు బందోబస్తు

- వావిలపల్లిపేట ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ తీరుపై విమర్శలు 

- నిలదీసిన తల్లిదండ్రులు  ఫ చివరకు ఎన్నిక నిర్వహణ

పొందూరు: పీఎంసీ ఎన్నికలో వావిలపల్లిపేట ఆదర్శ పాఠ శాల ప్రిన్సిపాల్‌ మార్తా తిలకం ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. సరిపడ కోరం ఉన్నా పీఎంసీ ఎన్నిక నిర్వహణకు ఆమె ససేమిరా అన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు.  రెండో విడతలో భాగంగా బుధవారం వావిలపల్లిపేట ఆదర్శ పాఠశాలలో 7,9,10 తరగతులకు పీఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.  ఏడో తరగతికి సంబంధించి సరిపడ కోరం ఉండగా.. మిగిలిన రెండు తరగతులకు కోరం లేదు. ఏడో తరగతిలో 96 మందికి గాను మధ్యాహ్నం ఒంటి గంటలోపు 49మంది తల్లిదండ్రులు హాజర య్యారు. కోరం సరిపోవడంతో ఎన్నిక నిర్వహిస్తారని తల్లిదండ్రులు ఎదురు చూశారు. ఇంతలో ఎన్నిక నిర్వ హించ మని ప్రిన్సిపాల్‌ ప్రకటించారు. దీంతో  టీడీపీ టీడీపీ రామ్మో హన్‌, శంకరభాస్కర్‌, నారాయణరావు, శ్రీనివాసరావులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపాల్‌ను నిలదీశారు.  మధ్యాహ్నం 12 గంటల వరకే ఎన్నికల నిర్వహణకు సమయమని ఆమె చెప్పారు. ఆ నిబంధ నలు చూపించాలని తల్లిదండ్రులు ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయం ఉన్నా.. తాను  మాత్రం 12 గంటల వరకు వచ్చిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటానని  ప్రిన్సిపాల్‌  సమాధానం చెప్పారు. దీంతో తల్లిదండ్రులు నిరసన తెలియ జేయడంతో చివరకు పరిశీలకుడు శ్రీనివాసరావు జోక్యంతో ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ  బందో బస్తును ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-10-07T06:04:46+05:30 IST