ఇది ప్రభుత్వ దుశ్చర్య

ABN , First Publish Date - 2021-10-25T05:44:15+05:30 IST

ఆంధ్రా, ఒడిశా ప్రజల ఇలవేల్పు పాతపట్నం నీలమణిదుర్గ ఆలయ ప్రహరీ, సింహద్వారం తొలగింపు ప్రభుత్వ దుశ్చర్య అని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆదివారం పాతపట్నం నీలమణిదుర్గ ఆలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా శనివారం ఆలయ ప్రహరీతో పాటు సింహద్వారాన్ని యంత్రాలతో తొలగించిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఇది ప్రభుత్వ దుశ్చర్య
ప్రధాన రహదారిపై బైఠాయించిన టీడీపీ నాయకులు




- నీలమణిదుర్గ ఆలయ ప్రహరీ, సింహద్వారం తొలగింపు అన్యాయం

- టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌

- పాతపట్నంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆందోళన

పాతపట్నం, అక్టోబరు 24: ఆంధ్రా, ఒడిశా ప్రజల ఇలవేల్పు పాతపట్నం నీలమణిదుర్గ ఆలయ ప్రహరీ, సింహద్వారం తొలగింపు ప్రభుత్వ దుశ్చర్య అని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆదివారం పాతపట్నం  నీలమణిదుర్గ ఆలయం వద్ద ఆందోళనలు చేపట్టారు.  రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా శనివారం ఆలయ ప్రహరీతో పాటు సింహద్వారాన్ని యంత్రాలతో తొలగించిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆదివారం టీడీపీ పార్లమెం టరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. ముందుగా నీలమణిదుర్గ ఆలయంతో పాటు సమీపంలోని ఆంజనేయ ఆలయం వద్ద తొలగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ దుశ్చర్యగా అభివర్ణించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో నాలుగు అడుగులు తొలగించాల్సి ఉన్నా..15 అడుగులు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. రెండో వైపు విస్తరించి ఉంటే ఆలయానికి నష్టం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. టీడీపీ హయాంలో అధిక నిధులు వెచ్చించి అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆంజనేయ ఆలయాన్ని నేలమట్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విగ్రహాలను సంరక్షిస్తామన్నా సమయం ఇవ్వకపోవడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణమూర్తి మాట్లాడుతూ ఎవరి అభిప్రాయాలు తీసుకో కుండా, కనీస సమాచారం లేకుండా తొలగింపు పనులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తొలగించడం అమా నుషమన్నారు. శ్రీకాకుళం-పాతపట్నం-టెక్కలి ప్రధాన రహదారిపై బైఠాయించడంతో కొద్దిసేపు వాహ నాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయు డు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌తో పాటు పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, హిరమండలాలకు చెందిన టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. కాగా కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా నిరసన చేపట్టారంటూ కూన రవికుమార్‌, కలమట వెంకటరమణమూర్తితో సహా 17 మందిపై కేసు నమోదుచేసినట్టు పాతపట్నం ఎస్‌ఐ మహమ్మద్‌ అమీర్‌ ఆలీ తెలిపారు.



Updated Date - 2021-10-25T05:44:15+05:30 IST