పోరాటాలకు సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2021-10-08T05:29:52+05:30 IST

సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధంకావాల ని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు చిన్నాల అచ్యుతరావు, జిల్లా ప్రతినిధి మురపాక వెంకటరమణలు పిలుపునిచ్చారు.

పోరాటాలకు సిద్ధం కావాలి


రేగిడి: సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధంకావాల ని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు చిన్నాల అచ్యుతరావు, జిల్లా ప్రతినిధి మురపాక వెంకటరమణలు పిలుపునిచ్చారు.  సంకిలి, లక్ష్మీపురం, పనసలవలస, తదితర పాఠశాలల్లో గురువారం ఏపీటీఎఫ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.  సీపీఎస్‌ రద్దు, డీఏ బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు లెంక రామకృష్ణ, వై.రామ కృష్ణ, ఎం.సత్యంనాయుడు, వంజరాపు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T05:29:52+05:30 IST