వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-12T05:30:00+05:30 IST

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : ఎస్పీ

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : ఎస్పీ
పరికరాలను పరిశీలిస్తున్న ఎస్పీ అమిత్‌ బర్డర్‌

ఎచ్చెర్ల : వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ సూచించారు. ఎచ్చెర్లలోని ఆర్మ్‌డ్‌ రిజర్వు కార్యాలయంలో సోమవారం బాంబు డిస్పోబుల్‌ బృందం పునశ్చరణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. శారీరక దారుఢ్యం, యోగా, వివిధ అంశాలపై వారం రోజుల పాటు తీసుకున్న శిక్షణను విధి నిర్వహణలో వినియోగించాలన్నారు. శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగితే వృత్తిలో మరిన్ని విజయాలు సొంతం చేసుకోగలమన్నారు. వీఐపీ, వీవీఐపీ పర్యటనలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సోమశేఖర్‌ (అడ్మిన్‌), డీఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌, ఆర్‌ఐలు ప్రదీప్‌, ఉమామహేశ్వరరావు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొ న్నారు. అనంతరం హ్యాండ్‌ బాల్‌ మెటల్‌ డిటెక్టర్‌, డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌, పాకెట్‌ స్కానర్‌ తదితర పరికరాలను పరిశీలించారు.   


Updated Date - 2021-07-12T05:30:00+05:30 IST