రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలి
ABN , First Publish Date - 2021-10-30T05:10:45+05:30 IST
కాకినాడ జేఎన్‌టీయూలో శని, ఆదివారాల్లో జరగనున్న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించి గుర్తింపు తీసుకురావాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పోటీలకు వెళుతున్న క్రీడాకారులను అభినందించారు.
మబగాం(పోలాకి): కాకినాడ జేఎన్‌టీయూలో శని, ఆదివారాల్లో జరగనున్న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించి గుర్తింపు తీసుకురావాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పోటీలకు వెళుతున్న క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో పీఈటీలు భవానీ, లక్ష్మణరావు, హెచ్‌ఎంలు వి.బాబూరావు, వాసుదేవరావు తదిత రులు పాల్గొన్నారు. ఈదులవలస మోడల్ స్కూల్ కళాశాల నుంచి రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు యారబాటి జ్యోతి ఎంపికకాగా ప్రిన్సిపాల్ ఇంజరాపు శ్రీనివాసరావు, పీడీ ఎం.నీలం అభినందించారు.
టెక్కలి నుంచి క్రీడాకారుల ఎంపిక
టెక్కలి: రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు టెక్కలికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారని చీఫ్ కోచ్ నర్శిపురం శేఖర్ తెలిపారు. శ్రీకాకుళంలో గురువారం జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన బాలికల విభాగంలో పులిబంద జాశ్విక, బొడ్డ గేయా మృత, సీపాన తనుశ్రీ, బాలుర విభాగంలో బి.మిథున్, ఉల్లాస, లోహిత్, ఆరంగి సాగర్, సీపాన అభిషేక్ ఎంపికయ్యారన్నారు. శని, ఆదివారాల్లో కాకినాడ జేఎన్‌టీయూలో జరగనున్న పోటీలకు హాజరవుతున్నారని చెప్పారు.