ఎన్నికల్లో సత్తాచాటాలి

ABN , First Publish Date - 2021-02-07T05:07:42+05:30 IST

స్థానికసంస్థల ఎన్ని కల్లో సత్తాచాటేలా టీడీపీ కార్య కర్తలు, నాయకులు పనిచేయాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యు డు కిమిడి కళావెంకటరావు పిలుపుని చ్చారు.

ఎన్నికల్లో సత్తాచాటాలి
మాట్లాడుతున్న కళావెంకటరావు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు 

ఎచ్చెర్ల: స్థానికసంస్థల ఎన్ని కల్లో సత్తాచాటేలా టీడీపీ కార్య కర్తలు, నాయకులు పనిచేయాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యు డు కిమిడి కళావెంకటరావు పిలుపుని చ్చారు. శనివారం ఎచ్చె ర్లలో ఏర్పాటుచేసిన కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ స్థానికసంస్థల  ఎన్నికలతో టీడీపీకి పూర్వవైభవం రావాలన్నారు. వైసీపీ 20 నెలల పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. టీడీపీ  మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించేలా ప్రణాళి కాబద్ధంగా పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీవీ రమణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, మాజీ సర్పంచ్‌లు మెండ రాజారావు పాల్గొన్నారు. 

20 మంది టీడీపీలో చేరిక

హరిపురం:మందస మండ లం  సువర్ణాపురం పంచాయతీ పరిధిలో వైసీపీ నుంచి కరగాన వాసు, బంగారు కృష్ణారావు, దాసరి మోహనరావు, రవి, నాగేశ్వరరావు, గొక్కరి సంజీవ్‌లతో పాటు మరో 14మంది శనివారం టీడీపీలో చేరారు. వీరికీ మాజీ మంత్రి గౌతు శివాజీ పార్టీ కండువావేసి  ఆహ్వానించారు.   స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-07T05:07:42+05:30 IST