ఆస్తులు కాపాడుకునేందుకు కేసీఆర్‌తో లాలూచీ: ఎంపీ రామ్మోహన్
ABN , First Publish Date - 2021-07-08T19:09:43+05:30 IST
సొంత ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం: సొంత ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఆస్తులను కాపాడుకోవడం కోసం కేసీఆర్‌తో లాలూచీ పడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రా జలదోపిడి చేస్తుందన్న తెలంగాణ మంత్రుల ఆరోపనలపై జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ముందుకు సాగడం లేదని ఎంపీ అన్నారు. రైతు ప్రభుత్వంగా చెబుతున్న వైసీపీ రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో టీడీపీ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేబినెట్ మాత్రమే కొత్తది... కేంద్ర ప్రభుత్వం మాత్రం పాతదే అని అన్నారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మౌనం వీడాలన్నారు. విభజన హామీల అమలుకు కేంద్రంపై వైసీపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.