సమతుల దాణాతో పాలు దిగుబడి

ABN , First Publish Date - 2021-11-01T05:12:29+05:30 IST

సమతుల దాణా ద్వారా పాడి పశువులు అధికంగా పాలు ఇస్తాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పలాస, మందస మండలాలకు చెందిన పాడి రైతులకు సమతుల్య దాణాను సరఫరా చేశారు.

సమతుల దాణాతో పాలు దిగుబడి
పశుదాణాను పంపిణీ చేస్తున్న మంత్రి అప్పలరాజు

పలాస : సమతుల దాణా ద్వారా పాడి పశువులు అధికంగా పాలు ఇస్తాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పలాస, మందస మండలాలకు చెందిన పాడి రైతులకు సమతుల్య దాణాను సరఫరా చేశారు. రూ.3,150 విలువ చేసే ఈ దాణాను ప్రభుత్వం సబ్సిడీపై రూ.1300లకే 200 కిలోలు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అవసరమైన రైతులు నేరుగా రైతుభరోసా కేం ద్రాల్లో తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌ కుమార్‌, హనుమంతు వెంకటరావుదొర, డీడీ వి.జయరాజ్‌, ఏడీ పోతన పల్లి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-01T05:12:29+05:30 IST