జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు
ABN , First Publish Date - 2021-10-30T05:15:57+05:30 IST
జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అన్నారు. జీఎంఆర్ వరలక్ష్మీ కేర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సి జన్ ప్లాంట్‌ను శుక్రవారం ప్రారంభించారు.
కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాజాం రూరల్, అక్టోబరు 29: జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అన్నారు. జీఎంఆర్ వరలక్ష్మీ కేర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సి జన్ ప్లాంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రభుత్వ ఏరియా, సామాజిక ఆసుపత్రులతో పాటు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం తో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. టెక్కలి, సీతంపేట, రణస్థలంలలో త్వరలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. కరోనా థర్డ్‌వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ దామెర రాజేంద్ర, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాలు కేటాయించండి
రాజాం: జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని రాజాం జర్నలిస్టుల ఫోరం (ఆర్‌జేఎఫ్) ప్రతినిధులు కోరారు. ఈ మేర కు శుక్రవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఎన్నిసార్లు స్థలాలు కేటాయించాలని అధికారులను కోరినా స్పందించడం లేదని అధ్యక్షుడు భీంపల్లి తిరుపతిరావు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్‌తో చర్చించి ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.