వాల్మీకి జీవితం ఆదర్శనీయం
ABN , First Publish Date - 2021-10-20T05:30:00+05:30 IST
వాల్మీకి జీవితం ఆదర్శనీయం

- విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి : మహర్షి వాల్మీకి జీవితం నేటికీ ఎంతో ఆదర్శనీయమని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు కొనియాడారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో డీఐజీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి డీఐజీ రంగారావు, ఎస్పీ అమిత్‌బర్దర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు వీరకుమార్, శేఖర్, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. - గుజరాతీపేట : వాల్మీకి రిచించిన రామాయణం ప్రపంచానికి ఆదర్శనీ యమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 12 మందికి కారుణ్య నియామకం జిల్లాలో వివిధశాఖల్లో పనిచేస్తూ మరణించిన ప్రభుత్వోగుల కుటుంబాలలోని 12 మందికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్ లఠ్కర్, జేసీ శ్రీరాములు నాయుడు, డీఆర్‌వో దయానిది తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాల్మీకి జంయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.సురేఖ, సాంస్కృత భాషా విభాగం అధ్యక్షుడు రామారావు, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.