మోసగాళ్లను పట్టుకుంటాం : సీఐ

ABN , First Publish Date - 2021-10-28T05:54:15+05:30 IST

మోసగాళ్లను పట్టుకుంటాం : సీఐ

మోసగాళ్లను పట్టుకుంటాం : సీఐ
ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పోలీసు బందోబస్తు

రాజాం/రూరల్‌ : రాజాంలో గత రెండు రోజులుగా సాంకేతికతను ఉప యోగించుకుని మో సాలకు పాల్పడుతున్న కేటుగాళ్లను పట్టుకుంటామని సీఐ పి.శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ఈనెల 26, 27 తేదీల్లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన టోకరా కథనాలపై సీఐ స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. శాంకేతికతను అడ్డంపెట్టుకుని వ్యాపారులను మోసం చేసేవారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇదే సమయంలో వ్యాపారులు కూడా అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. వ్యాపారులు అమ్మకాల సమయంలో నగదు తమ ఖాతాలోకి చేరిందీ లేనిది కొనుగోలుదారులు ఉన్నప్పుడే పరిశీలించుకోవాలన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో గల సెల్‌పాయింట్‌లో జరిగిన టోకరాపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను త్వరలనో పట్టాకుంటామని సీఐ స్పష్టం చేశారు. 


బస్టాండ్‌లో నిఘా...

రాజాం బస్టాండ్‌లో నిఘా పెట్టామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేకం గా సిబ్బందిని నియమించినట్టు ఆయన వెల్లడించారు. ప్రతిరోజూ సాయంత్రం వందల సంఖ్యలో విద్యార్థులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకుంటారని, ఆ సమయంలో కొంతమంది ఆకతాయిలు అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయని తెలిపారు. అమ్మాయిలను వేదిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.  

Updated Date - 2021-10-28T05:54:15+05:30 IST