ఓవరాల్‌ చాంపియన్‌గా కృష్ణా

ABN , First Publish Date - 2021-03-22T04:55:56+05:30 IST

రాష్ట్రస్థాయి సైకిల్‌ పోలో పోటీల ఓవరాల్‌ చాంపియన్‌గా కృష్ణా జిల్లా నిలిచింది. స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ చౌదరి సత్యనారాయణ జ్ఞాపకా ర్థంగా శ్రీకాకుళంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న 4వ రాష్ట్రస్థాయి బాలుర సైకిల్‌ పోలో పోటీలు ఆదివారం ముగిశా యి.

ఓవరాల్‌ చాంపియన్‌గా కృష్ణా
విజేతలకు బహుమతులందజేస్తున్న కృపారా


అన్ని విభాగాల్లో ప్రథమ స్థానం

 ముగిసిన రాష్ట్రస్థాయి సైకిల్‌ పోలో పోటీలు

గుజరాతీపేట, మార్చి 21: రాష్ట్రస్థాయి సైకిల్‌ పోలో పోటీల ఓవరాల్‌ చాంపియన్‌గా కృష్ణా జిల్లా నిలిచింది. స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ చౌదరి సత్యనారాయణ జ్ఞాపకా ర్థంగా శ్రీకాకుళంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న  4వ రాష్ట్రస్థాయి బాలుర సైకిల్‌ పోలో పోటీలు ఆదివారం ముగిశా యి. సీనియర్‌, జూనియర్‌, సబ్‌జూనియర్‌  విభాగాల్లో  కృష్ణా జిల్లా క్రీడాకారులు ప్రథమస్థానాన్ని కైవసం చేసుకున్నారు.   చివరి రోజు ఈ పోటీలు ఎంతో ఉత్కంఠంగా సాగాయి.  సీనియర్స్‌ విభాగంలో కృష్ణా, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు జట్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. జూనియర్స్‌ విభాగంలో కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, సబ్‌జూనియర్స్‌ విభాగంలో కృష్ణా, శ్రీకాకుళం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ స్థానాలు కైవసం చేసుకున్నాయి. విజేతలకు కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపా రాణి, ఏపీఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఎంవీ పద్మావతిలు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సైకిల్‌ పోలో  అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చౌదరి సతీష్‌, పైడి గోవిందరావు, పీఈటీ, పీడీల అసోసియేషన్‌ ప్రతినిధులు ఎన్‌వీ రమణ, ఎం.సాంబమూర్తి పాల్గొన్నారు. 
 


Updated Date - 2021-03-22T04:55:56+05:30 IST