కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరూ వేసుకోవాలి

ABN , First Publish Date - 2021-02-06T05:10:32+05:30 IST

కరోనా నియంత్రణకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని తహసీల్దార్‌ జామి ఈశ్వరమ్మ తెలిపారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరూ వేసుకోవాలి
వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న తహసీల్దార్‌ జామి ఈశ్వరమ్మ

జలుమూరు, ఫిబ్రవరి 5: కరోనా నియంత్రణకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని తహసీల్దార్‌ జామి ఈశ్వరమ్మ తెలిపారు. స్థానిక పీహెచ్‌సీలో శుక్రవారం ఆమె వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొలిదశలో వైద్య సిబ్బందికి, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలకు ఈ వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు తాడేల శ్రీకాంత్‌, చల్ల వంశీకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T05:10:32+05:30 IST