కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-10-30T05:13:06+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి

- కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు నుంచి బయటపడేందుకు  ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌  వేయించుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌  తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని మండలాల అధికారులతో ఆయన మాట్లాడారు. ఇంతవరకు టీకా తీసుకోనివారు తప్పనిసరిగా సమీప వ్యాక్సిన్‌కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. వ్యాక్సిన్‌ సురక్షితమైనదని.. ఎటువంటి అపోహలు వద్దని వివరించారు. మాస్కులను ధరించడం, జాగ్ర త్తలు పాటించడం తప్పనిసరి అని  తెలిపారు. 


శాశ్వత గృహ హక్కు..

జిల్లాలో 1983 సంవత్సరం నుంచి పలు పథకాల కింద మంజూరైన ఇళ్లకు  సంబంధించి శాశ్వత గృహ హక్కు కల్పించేందుకు ప్రభుత్వం వన్‌ టైం సెటిల్‌మెంట్‌ను  తీసుకువచ్చిందని కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ తెలిపారు. నిర్దేశించిన మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లిస్తే వారికి శాశ్వత గృహ హక్కు లభిస్తుందన్నారు. రుణాలు తీసుకోని లబ్ధిదారులు రూ.10వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 11లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యమని  తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జేసీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:13:06+05:30 IST