కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-08-22T05:19:00+05:30 IST

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మధ్యాహ్న భోజనం అమలుచేయాలని ఎండీఎం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.గంగభవానీ ఆదేశించారు. శనివారం పట్టణంలో ప్రభుత్వ పాఠశాల, బాలికోన్నత పాఠశాలల్లో ఎండీఎం నిర్వహణను పరిశీలిం చారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
నరసన్నపేట: భోజనాన్ని పరిశీలిస్తున్న ఏడీ గంగాభవానీ

నరసన్నపేట, ఆగస్టు 21 : పాఠశాలల్లో  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మధ్యాహ్న భోజనం అమలుచేయాలని ఎండీఎం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.గంగభవానీ ఆదేశించారు. శనివారం పట్టణంలో ప్రభుత్వ పాఠశాల, బాలికోన్నత పాఠశాలల్లో ఎండీఎం నిర్వహణను పరిశీలిం చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేపట్టి భోజనాన్ని అందించాలన్నారు. హెచ్‌ఎంలు పర్యవేక్షణ చేపట్టాలని సూ చించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్ర మంలో ఎండీఎం సూపరింటెండెంట్‌ ఏవీ పట్నాయక్‌, ఎంఈవో ఉప్పా డ శాంతారావు, హెచ్‌ఎంలు  పి.వెంకట్రావు, ఉషారాణి పాల్గొన్నారు. 


మధ్యాహ్న భోజనం నిర్వహణపై ఆగ్రహం

హిరమండలం: మధ్యాహ్న భోజన నిర్వహణపై ఎంపీడీవో ఎం.ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. చొర్లంగి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని శనివారం పరిశీలించారు. సాంబారు నీరులా ఉండడం, భోజనం తయారీలో నాణ్యత లేకపోవడంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంఈవో రాంబాబు పాల్గొన్నారు.


స్కూల్‌ కాంప్లెక్స్‌  సమావేశ మందిరం ప్రారంభం

రేగిడి: పాఠశాలల్లో కొవిడ్‌  నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఎంఈవో వరప్రసాదరావు సూచించారు. అంబఖండి హైస్కూల్‌లో నూతనంగా నిర్మించిన స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశ మంది రాన్ని ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో  హెచ్‌ఎం శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-08-22T05:19:00+05:30 IST